| ఇతర దేశాలు కళ్లు తెరవకపూర్వమే విజ్ఞానం పంచింది ఈ దేశము. ఇతర జాతులకు నాగరికత అంటే ఏమిటొ తెలియని రోజుల్లోనే నాగరికతతో వర్ధిల్లింది ఈ నా దేశము.ఈ సృష్టియందు మానవ జాతి ఉత్పన్నమైన నాటి నుండే ( అంటే 196,08,53,110 సంవత్సరాలు ) అద్భుత సంస్కృతి, సభ్యతతో విరాజిల్లింది భారతదేశము. దీనికి కారణం వేదజ్ఙానముతో సంపన్నం కావడమై తే ఋషులు, మహర్షులు దాన్నిరక్షిస్తూ ముందు తరాల వారికి అందిస్తు దృడమైన పునాదులపై వుంచారు ఈ సంస్కృతిని.అలా ఈ సంస్కృతి కోట్లాది సంవత్సరాల చరిత్ర కలిగి మానవ జాతికి తలమానికమై నిలిచింది.ఈ సృష్టిలొ ఏ జాతికూడా ఇంతటి దీర్ఝకాల చరిత్ర కలిగి లేదు.ఇంతటి మహత్తరమైన చరిత్ర కలిగియున్న ఈ దేసంస్కృతి, సభ్యత అనేక ఆటుపోట్లకు గురై దయనీయ స్థితికి చేరుకుంది. కాబట్టి ఈ దేశాన్ని పూర్వవైభవ స్ఠితికి తీసుకరావల్సిన ఆగత్యాన్ని గుర్తించి యోగఋషి స్వామి
రామ్‌దేవ్ జీ మహరాజ్ గారు భారతస్వాభిమాన్ పేరిట పెద్ధ ఉద్యమాన్నే లేవదీశారు. ఈ ఉద్యమము యొక్క ముఖ్య ఉద్దేశ్యము భారతదేశమును పీడిస్తున్న అన్ని జాడ్యాలను తొలగించి తిరిగి ప్రపంచానికి ఓక ఉన్నత ఆదర్శాలు , జీవన విధానము కల్గి యున్న జాతిని పరిచయము చేయడము.
అంశాలు
అందుకు ఈ క్రింద పేర్కొన్న విషయాల యందు త్వరితగతి మార్పు అవసరము
1) దేశీయ విద్యావిధానము
2) దేశీయ వైద్యవిధానము ( ఇతర చికిత్సాపద్ధతుల కంటే ముందుగా ఆయుర్వేదాన్ని అబివృద్ధి చేయడము )
3) స్వదేశి ఆర్ధిక వ్యవస్థ
4) స్వదేశి చట్టం, పన్నుల వ్యవస్థ
5) భారత దేశ సంస్కృతి రక్షణ
6) భ్రష్టాచారం, నిరుద్యోగం, పేదరికం, అధిక ధరలు మరియు ఆకలిచావులు లేని వైభవం తో కూడిన భారతదేశ నిర్మాణం.
7) గ్రామాలలొ స్వావలంబన
8) పర్యావరణ పరి రక్షణ, పరిశుబ్రత
9) జనాభ నియంత్రణ
ఇవన్నీ సాధించుటకు మనుషుల భావనలు, ఆలోచనా విధానాన్ని మార్చవలసిన అవసరముంటుంది. దీనికి 'యోగ సాధన' సాధనంగా తీసుకోవడము జరిగింది. |