మొదటిపేజి   I   విచారణ   I     చిరునామ
 
 
 
 
ఎలాంటి దేశము కావాలని కోరుకుంటున్నారు?

ఆరొగ్య భారతం, పరిశుబ్ర భారతం, స్వతంత్ర్య, స్వావలంబన కల్గిన దేశము, ఆకలి, పేదరికం, నిరుద్యోగం నుండి విముక్తి చెందిన దేశం, రాజకీయ అవినీతి లేని దేశం. ఇవియే ఈ ట్రస్టు యొక్క ముఖ్య లక్ష్యాలు. దేశంలొ అతిపెద్ద సమస్య అవినీతి. దీనిని నిజాయితీ, దేశభక్తి కలిగిన నాయకులన్య్ ఎన్నుకోవడం ద్వారా నిర్మూలించాలని సంకల్పించాము. అవినీతి వల్ల దేశంలొ నిరుద్యొగము, యువకులలొ నిరాశ, నిస్పృహలు, నల్ల డబ్బు పేరుకుపోవడము, ప్రగతి కుంటుపడడం వల్ల విదేశీ పరిశ్రమలను ఆహ్వానించడము వాటికి పెద్ద పీట వేయడము జరుగుతున్నది.

దీనివల్ల దేశీయ కంపనీలు మూసుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవినీతివల్ల నాసి రకం రోడ్లు అద్వాన్నమౌతున్నాయి. అవినీతి వల్ల కాలుష్య నియంత్రణకు అడ్దుకట్ట పడింది. కాలుష్యం పెరిగిపొయి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇంతేకాకుండా దేశములోని ప్రతి అనర్ధానికి అవినీతి కారణమౌతుంది.

మానవుడు ఎంత భౌతిక ఉన్నతి సాధించినప్పటికీ దాని వెనుక ఒకే లక్ష్యం ఉంది. అదే సుఖాన్ని, ఆనందాన్ని పొందడము. మరి భౌతిక ఉన్నతిని సాధించిన అనంతరం వ్యక్తి నిజమైన సుఖాన్ని, ఆనందాన్ని పొందగల్గుతున్నడా అంటె అదీ సందేహాస్పదమే. ఇక భారత ప్రాచీన సంస్కృతి నాగరికత విషయానికి వస్తే... భారతీయులు ఎప్పుడూ సత్యం, అస్తేయం (దొంగతనం చేయకొండా ఉండడము) బ్రహ్మచర్య పాలన, అపరిగ్రహం అంటే భౌతిక సంపదలను త్యజించడం,లేదా అవసరానికి మించి సంపదలను సేకరించకుండా ఉండడము. సేకరించిన ధనాన్ని సమాజ ఉన్నతికి వ్యయము చేయడము లాంటివి ఆచరించే వారు. ధనశుద్ది అంతే కేవలం న్యాయమార్గాన మాత్రమే ధనాన్ని సంపాదించడము, శరీర శుద్ది (స్నానాది క్రియలవల్ల), సత్యపాలన, న్యాయ ధర్మాల ఆచరణ ద్వారా మనస్సు, బుద్ధి శుద్దిచేయడము. ఈశ్వర ధ్యానంవల్ల ఆత్మశుద్ది పొందడము లాంతి క్రియలు ఆచరించేవారు. సంతొషం అంతే ఉన్న దాంతో త్రుప్తి చెందడము, అందని వాటికొరకు అర్రులు చాచకుందా ఉండడము, ఇతరులను చూసి ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంతి వికారాలకు లోనుకాకుండా సంతొషంగా జీవించడము.

తపస్సు - అంటే ద్వంద్వ సహనము అంటే - సుఖ, దుఖాలకు చలించకుండ ఉండడము, మాన అవమానాలను సహించడము, ఆకలి, దప్పికలను సహించదము, శీథొష్నాదులను తట్టుకోగలగడము మొదలగునవి.

స్వాధ్యాయము - అంటే ఆత్మ , పరమాత్మలను గూర్చి ఆలోచించడము, ధ్యానించడము, విచారించడము, సత్సంగములలో పాల్గొనడము, ఆధ్యాత్మిక గురువుల వద్దకు చేరి సందేహ నివృత్తి చేసుకోవడము, ఆధ్యాత్మిక గ్రంథ పఠనచేయడము, మానవ జీవిత లక్ష్యం గూర్చి విచారించడము, ఆ లక్ష్యములో తాను సాధించిన ప్రగతి గూర్చి మననం చేసుకోవడం, మొదలగునవి.

ఈశ్వర ప్రణిదానము - అంటే జీవుడు తనను తాను పరమాత్మకు సమర్పించుకోవడం. జీవాత్మ అత్యల్పుడని, తన శరీరము, మనస్సు, బుద్ధి, శక్తిసామర్థ్యములు, బలము మొదలగునవి అన్నియు పరమాత్ముని కృపవలననే లభ్యమయ్యాయని భావించి, వాటి ద్వారా సాధించిన విజయాలు, లేదా శుభకార్యాలన్నీ ఈశ్వరునికే అర్పించుకోవడము. ఇలాంటి భావనలు, ఆలొచనలు, ఆచరన కలిగియుండడము ద్వారా భారత సంస్కృతి ప్రపంచములోకెల్లా ఒక విశిష్ఠ, ఉత్కృష్ఠ స్తానాన్ని కల్గియుండెడిది. ఈ దేశాన్ని తిరిగి పూర్వవైభవానికి తీసుకెల్లాలని స్వామీజి సంకల్పించారు. ఈ దేశాన్ని తిరిగి పూర్వవైభవానికి తీసుకెల్లాలని స్వామీజి సంకల్పించారు. ఇవి సాధించుకోవడానికి కేవలం ' యోగ్' మాత్రమే ఏకైక మార్గము. దీనివల్ల శరీర స్వస్థతతోపాటు, మనస్సు, బుద్ధిని ఆధీనములో ఉంచుకోవడం జరుగుతుంది. దీనివల్ల మనిషి శుభకర్మలు ఆచరించడమే తప్ప దుష్కర్మములవైపు వెళ్ళుట తటస్థించదు. ఆ విధముగా భారతీయులు తమ ఆచార, విచారముల ద్వరా ఆచరణ ద్వార సమాజ ఉన్నతి, మానవ కళ్యానమునకై తపించేవారు.

ప్రస్తుతము దేశములో యువత పూర్తిగా పాశ్చత్య నాగరికత వైపు మొగ్గడము, భౌతికవాదము, భౌతిక సంపదకై వెంపర్లాడడము, దానిని సాధించడానికి ఎంతకైనా తెగించడము, న్యాయ, ధర్మ విచక్షణ లేకుండా వ్యవహించడము జరుగుతున్నది. దీనివల్ల భారతవ్యవస్థ పతనావస్థకు చేరుతున్నది. యువతకు తమ ప్రాచీన సంస్కృతి, సభ్యతల గురించి ఏమాత్రము అవగాహన లేకపొవడమే కాకుండా, ఆ సంస్కృతిని అవహేలన చేయటము కూడా జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితి నుంచి దేశాన్ని బయటపడవేయవలసి ఉన్నది. దీనికై భారత స్వాభిమాన్ ట్రస్ట్ నడుము బిగించింది. ఈ విషయములో దేశ ప్రజల సంపూర్ణ సహకారము కావల్సి ఉన్నది.

కావున దేశ పౌరులందరు భారత స్వాభిమాన ట్రస్ట్ సభ్యులుగా చేరి భారతపునర్ణిర్మాణ కార్యక్రమములో పాల్గొని పుణ్యభాగ్యులు కావాలని ఈ ట్రస్ట్ కోరుకుంటుంది.
 
 
 
  ఆస్థా చానల్ చూడండి
యోగ సందేశ్ పత్రిక చదవండి