మొదటిపేజి   I   విచారణ   I     చిరునామ
 
 
 
 
లక్ష్యాలను సాధించడం ఎలా?  
లక్ష్యాలను సాధించడం కోసం (15) ముందు పేర్కొన్న వివిధ సంఘటనలను ఏర్పాటు చేయడము జరిగింది. ఈ 15 సంఘటనలు జిల్లాల వారిగా ఏర్పాటు చేయడానికి తగిన కృషి జరుగుతున్నది. ప్రతి జిల్లాలో 2100 యోగ శిక్షకులతో సహా 21000 వరకు భారత్ స్వాభిమాన్ విశిస్ట సభ్యులను తయారుచేస్తున్నారు. వీరు 21 లక్షల విశిష్ట కార్యకర్త సభ్యులను తయారుచేస్తారు.

ఈ జాతీయ విప్లవంలొ చేరటానికి పైన పేర్కొన్న 15 గ్రూపుల్లొ ఏ ఒక్కదానికి చెందిన వారైనా స్థానిక భారత స్వాభిమాన్ పతంజలి యోగ సమితి /పతంజలి చికిత్సా కేంద్రాన్నైనా గాని సంప్రదించవచ్చు. భారత స్వాభిమాన్ ట్రస్టులొ మెంబరు కాదలుచుకున్నవారు (5) సంకల్పములు తీసుకోవల్సి ఉంటుంది.

1) నేను దేశభక్తి, నిజాయితి, దూరదృష్టి, పరాక్రమము (నిర్భయత్వము), నైపుణ్యం కలిగిన వ్యక్తికే ఓటు వేస్తాను. నేను ఓటు వేయడమే కాదు, ఇతరులు కూడా ఓటు వేసేలా ప్రయత్నిస్తాను.

2) దేశభక్తి నిజాయితీ, చైతన్యవంతులు, సున్నితులు, తెలివైన ప్రజలందర్ని ఐక్యం చేయడానికి పూర్తి ప్రయత్నం గావిస్తాను.

3) జీరో టెక్నాలజీతో తయారైన విదేశీ వస్తువులను పూర్తిగా బహిష్కరించి, స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగిస్తాను.

4) జాతీయ చింతనను కల్గి ఉంటాను. రోజుకు కనీసం 15ని|| పాతైనా నా జాతి కోసము దేశముకోసం ఆలోచించి నా కర్తవ్యాన్ని స్మరించుకుంటాను. దేశ సమైక్యత కోసం నా కృషి చేస్తాను.

5) నేను యోగను ప్రచారంచేస్తూ, ప్రజలలో స్పూర్తిని కలిగించి, యోగను అభ్యసించే విధంగా కృషిచేస్తాను. వారిలో ఆత్మగౌరవ భావనను నింపుతాను.

 

 
 
 
  ఆస్థా చానల్ చూడండి
యోగ సందేశ్ పత్రిక చదవండి