మొదటిపేజి   I   విచారణ   I     చిరునామ
 
 
 
జాతీయవాదాన్ని బలమైన పునాదులపై నిలబెట్టేందుకు ఏడు సూత్రాల ప్రణాళిక రూపొందించబడింది. అవి ఇలా ఉన్నాయి. 1) జాతీయ వాదం; 2) పరాక్రమము; 3) పారదర్సకము; 4) దూర ( దృష్టి ) దర్సనం; 5) మానవతావాదం; 6) ఆధ్యాత్మిక వాదం; 7) వినయశీలం.
1) జాతీయవాదం:
దేశన్ని అతి ఉన్నత స్థానంలొ ఉంచడము. జాతీయ ధర్మాన్ని ప్రథమంగా పరిగణించడము, దేశాన్ని ప్రేమించడము, అన్ని ఆరాధనలోకెల్లా దేశ ఆరాధనే ప్రథమం, ఆలోచనలొ దేశ అభిమానం ఇవి జాతీయ వాద లక్షణాలు.
2) పర్రక్రమశీలత:
దేశజాతి శ్రేయస్సు కోసం ఎలాంటి సంకటస్తితినైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండడము. సత్వర నిర్ణయాలు తీసుకోవడం, నిర్భయంగా వ్యవహరించడం, మూఢనమ్మకంలో చిక్కియుండకపొవడం, కార్యసాధనలొ ఎప్పుడు ధృఢచిత్తంతొ, విశ్రమించకుండా, సోమరితనం, అలసత్వం దరిచేరనీయకుండా వ్యవహరించడం.
3) పారదర్శత:
తన అంతర్గత మరియు బాహ్యా జీవితాల మధ్య తేడా లేకుండా ఉండడము. పూర్ణ పవిత్రతను కల్గియుండడము. పాపరహిత జీవితాన్ని కొనసాగించే వ్యక్తి పారదర్శకతను ప్రదర్శిస్తాడు.
4) దూరదృష్టి:
ఇప్పుడు జరుగుతున్న క్రియలవల్ల, పనులవల్ల ముందు పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించగల్గడము. అవి దేశ అహితానికి పునాదులైతే వాటిని అద్దుకొవడము, నిరోధించడము.
5) మానవతావాదం:
ఏ మతానికి చెందిన వారైనా మిగతా మతస్థులను తమతో సమానంగా గౌరవించడము, అహింస, సత్యం, న్యాయం అందరి ఎడ సమాన వ్యవహారం మొదలగునవి.
6) ఆధ్యాత్మికవాదం:
ఆస్తికుడు, ధార్మికుడు, మతొన్మాది కానివాడు ప్రతి ప్రాణిలో భగవంతుడి రూపాన్ని దర్శించేవాడు, మానవతావాది, సార్వభౌమిక, వైజ్ఞానిక విలువలు, ఆదర్శాలు, సంప్రదాయాలను తన ధర్మంగా భావించేవాడు, సర్వమానవాళి కి, పరమేశ్వరుని సేవచేసే వ్యక్తి.
7) వినయశీలత:
అధికారం, ఆస్తి, విల్లసాలు, విజ్ఞనాలలో అత్యున్నత స్తానానికి చేరుకొని కూడా ఇతరులకు వినయంగా సేవచేసే వ్యక్తి, నిరహంకారి.
ఈ సూత్రాలను గౌరవించి, ఆదరించే వ్యక్తులను భారత స్వాభిమాన్ లొ చేర్చడము, అలాంటి వ్యక్తులందరిని సంఘటితపర్చడము, ఇవి భారత స్వాభిమాన్ ముందున్న ప్రథమ కార్యక్రమములు.

 
 
  ఆస్థా చానల్ చూడండి
యోగ సందేశ్ పత్రిక చదవండి